ఈ నెల 16 నుండి ‘బాహుబలి’ తాజా షెడ్యూల్

ఈ నెల 16 నుండి ‘బాహుబలి’ తాజా షెడ్యూల్

Published on Sep 11, 2013 3:30 PM IST

Bahubali
ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల విరామం తరువాత ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 16 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనుంది. కొన్ని ఫైట్ సన్నివేశాలు, ముఖ్యమైన టాకీ పార్ట్ ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఒక మహా యోదుడిగా కనిపించనున్నాడు. అలాగే రానా దగ్గుపాటి ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తోంది. సత్యరాజ్, నాజర్, అడివి శేష్ మొదలగు వారు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా పీరియడ్ యాక్షన్ అడ్వంచర్ గా తెరకెక్కుతోందని సమాచారం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు