భయంకరమైన చలిలో బాద్ షా షూటింగ్

భయంకరమైన చలిలో బాద్ షా షూటింగ్

Published on Feb 24, 2013 10:39 PM IST

NTR-in-Baadshah2

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, బబ్లీ గర్ల్ కాజల్ జంటగా నటిస్తున్న ‘బాద్ షా’ చిత్రం ప్రస్తుతం స్విట్జర్ల్యాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఇటివలే ఈ జంట మధ్య స్విట్జర్ల్యాండ్ లో రీడెర్న్ సమీపంలో బెర్న్ అనే ప్రదేశంలో ఒక పాట చిత్రీకరించారు.

ఆ లోకషన్ చాల అందంగా ఉండటంతో అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 13 డిగ్రీలు ఉన్నప్పటికీ అక్కడే చిత్రీకరించాలని శ్రీను వైట్ల నిర్ణయించారు. ” స్విట్జర్ల్యాండ్ లో మంచు కప్పబడి ఉంది..ఇంటికి తిరిగివెళ్ళిపోవాలని ఉందని” కాజల్ ఆ లొకేషన్ విషయం బయటపెట్టింది. ఈ పాట తొందర్లోనే ముగుస్తుంది, దీనితో షూటింగ్ చాలా వరకూ పూర్తవుతుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియో మార్చ్ 10న విడుదలకానుంది. సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు