ఎన్.టి.ఆర్, కాజల్ జంటగా నటిస్తున్న ‘బాద్ షా ‘ చిత్రం యూరప్ షెడ్యూల్ ను ముగించుకుంది. స్పెయిన్ మరియు స్విట్జర్లాండ్ లోని పలు అందమైన ప్రదేశాలలో రెండు పాటలు ఎన్.టి.ఆర్ – కాజల్ ఫై చిత్రీకరించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. త్వరలో హైదరాబాద్ తిరిగి రానున్న ఈ చిత్ర బృందం మిగిలిన చిత్రాన్ని హైదరాబాద్లోనే చిత్రీకరించనున్నారు. నవదీప్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకొంటుంది.
మొదటిసారి ఎన్.టి.ఆర్ – శ్రీను వైట్ల కలిసి పనిచేస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రికార్డు బిజినెస్ జరిగిందని సమాచారం. థమన్ సంగీతాన్ని అందిచిన ఈ చిత్ర ఆడియో మార్చ్ 10న ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.