చివరి దశకు చేరుకున్న బాద్షా షూటింగ్

చివరి దశకు చేరుకున్న బాద్షా షూటింగ్

Published on Feb 27, 2013 8:20 AM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాద్షా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే స్పెయిన్, స్తిట్జర్లాండ్లో రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్, ఎడిటింగ్ పనులన్నీ శబ్దాలయ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈరోజు నుండి బాలన్స్ టాకీ పార్ట్ షూట్ చేయనున్నారు. మార్చ్ 10న షూటింగ్ పూర్తి చేసి అదే రోజు భారీ ఎత్తున ఆడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. శ్రీను వైట్ల గత చిత్రాల్లాగే కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు