మైనింగ్ మాఫియా మీద పోరాడబోతున్న బి.టెక్ బాబు

మైనింగ్ మాఫియా మీద పోరాడబోతున్న బి.టెక్ బాబు

Published on Oct 24, 2012 9:50 PM IST


నవంబర్ 9 నుండి పవర్ ఫుల్ మైనింగ్ మాఫియా మీద బి.టెక్ బాబు పోరాటం చెయ్యబోతున్నాడు. అదేనండీ మేము “కృష్ణం వందే జగద్గురుం” చిత్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ చిత్రంలో రానా బి.టెక్ బాబు గా కనిపించబోతున్నారు అంతేకాకుండా ఈ పాత్ర మైనింగ్ మాఫియా మీద పోరాడుతుంది. ఈ చిత్రం నవంబర్ 9న విడుదలకు సిద్దమయ్యింది ఈ చిత్రంలో రానా సరసన నయనతార నటించారు. కృష్ణుడు చెప్పిన గీతని కొత్త విధంగా చూపించడం జరిగింది అని దర్శకుడు క్రిష్ చెప్పారు. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే ప్రజాదరణ పొందింది. సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోట శ్రీనివాస రావు మరియు బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

తాజా వార్తలు