ఆగిన గోపిచంద్ సినిమా తిరిగి ప్రారంభం

ఆగిన గోపిచంద్ సినిమా తిరిగి ప్రారంభం

Published on Feb 20, 2013 12:50 PM IST

B-Gopal-Gopichand2

మాచో హీరో గోపిచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డైరెక్టర్ భూపతి పాండియన్ వెళ్ళిపోవడంతో నిలిచిపోయిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా తిరిగి మొదలవబోతోంది అని, అలాగే ఈ సినిమా స్టొరీలో మార్పులు చేయవచ్చునని అనుకుంటున్నారు. రమేష్ తాండ్ర నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3వ వారం నుండి తిరిగి షూటింగ్ జరుగనుంది. చాలా రోజులుగా హిట్ లేని గోపీచంద్ కి ఈ సినిమా కీలకం కానుంది.

తాజా వార్తలు