ప్రపంచ బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారీ చిత్రాల్లో దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన విజువల్ ఫీస్ట్ చిత్రాలు “అవతార్” సిరీస్ కూడా ఒకటి. మరి ఈ చిత్రాల్లో గత 2022లో వచ్చిన అవతార్ పార్ట్ 2 అవతార్ ది వే ఆఫ్ వాటర్ కూడా ఒకటి. ఈ సినిమా ఫ్యాన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా 2 బిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు ఈ సినిమా అందుకుంది.
మరి ఎట్టకేలకి ఈ సినిమాకి సీక్వెల్ గా మూడో భాగం ఈ ఏడాది డిసెంబర్ లో రాబోతుండగా దీనికి ముందు మేకర్స్ మరోసారి అవతార్ 2 ట్రీట్ ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ అక్టోబర్ మొదటి వారంలో కేవలం ఒక్క వారం ప్రదర్శనకి మాత్రం తీసుకొస్తున్నారు.
ఇలా అక్టోబర్ 3న గ్రాండ్ గా సినిమా విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇండియాలో కూడా ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అవతార్ 1 కి రీరిలీజ్ లలో భారీ రికార్డులు ఉన్నాయి. మరి అవతార్ 2 కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక అవతార్ 3 ఈ ఏడాది డిసెంబర్ 19న రిలీజ్ కి రాబోతుంది.
Avatar: The Way of the Water is back on the big screen starting October 3rd for one week only. Experience it in 3D. pic.twitter.com/ed5cxn8uQb
— Avatar (@officialavatar) September 3, 2025