పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రమే “ది రాజా సాబ్”. టీజర్ తో మంచి హైప్ అందుకున్న ఈ సినిమాని ఈ మధ్యనే మేకర్స్ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫామ్ చేశారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ కట్ కి సంబంధించి ఓ టాక్ బయటకి వచ్చింది. దీనితో అక్టోబర్ మొదటి వారంలోనే ది రాజా సాబ్ తాలూకా ఫస్ట్ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది ఫ్యాన్స్ కి మంచి ఎగ్జైటింగ్ వార్తే అని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.