పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “ఫౌజీ” (పరిశీలనా టైటిల్) కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్ ప్రకారం కొనసాగుతుండగా కొన్నాళ్ల నుంచి ఈ సినిమాకి సంబంధించిన లీక్స్ అంటూ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి.
ఇలా లేటెస్ట్ ఓ షాకింగ్ పిక్ ఏకంగా ప్రభాస్ పైనే లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోతుంది. అయితే ఇది లీక్ పిక్ కాదని చాలా మందికి తెలియలేదు. అది రాధే శ్యామ్ నుంచి క్లియర్ గా మార్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో. దీనితో అది చూసిన ఫ్యాన్స్ నిజం అని నమ్మేస్తున్నారు. కానీ అసలు విషయం తెలియలేదు. ఇంట్రెస్టింగ్ గా దీనిని కూడా ఫ్యాన్సే మార్చుకున్నారు. ఈ ఏఐ దెబ్బకి ఏది నిజం ఏది అబద్దం అనేది మాత్రం అభిమానులకి తెలియకుండా పోతుంది.