టీజర్ టాక్: ప్రామిసింగ్ కట్ తో అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’

టీజర్ టాక్: ప్రామిసింగ్ కట్ తో అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’

Published on Sep 4, 2025 12:02 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా రుహాణి శర్మ అలాగే నిహారిక ఎన్ ఎమ్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మెహర్ తేజ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రమే ‘ఆల్కహాల్’. మేకర్ నేడు రిలీజ్ చేస్తామని చెప్పిన టీజర్ ని ఫైనల్ గా వదిలారు. అయితే ఈ టీజర్ మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ మంచి థ్రిల్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తుందని చెప్పవచ్చు.

అసలు ఆల్కహాల్ ముట్టుకోని మనిషిగా అల్లరి నరేష్ కనిపిస్తుండగా తనతో ఎలాగైనా తాగించాలని అలా తాగాక ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కొనే మనిషిగా కమెడియన్ సత్య కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇందులో సెటప్ అంతా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఒక డార్క్ కామెడీతో అల్లరి నరేష్ నటన, సీక్వెన్స్ లు ఇందులో బాగున్నాయి.

అంతే కాకుండా తన ఫ్రెండ్స్ గా పరిచయం చేసినవాళ్ళని కొడతావా అంటే లేదు చంపేస్తా అని చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ గా కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అల్లరి నరేష్ నుంచి ఒక ఫన్ తో కూడిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రాబోయేలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు వచ్చే ఏడాది జనవరి 1న థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ కన్ఫర్మ్ చేసేసారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు