చాలా కాలం తర్వాత స్వీటీ అనుష్క నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఘాటి”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో చేసిన మరో చిత్రం ఇది కాగా ఆల్రెడీ సాలిడ్ బజ్ ఈ సినిమాపై ఉంది. అయితే దానిని మరింత లెవెల్లో పెంచే విధంగా ఇప్పుడు వచ్చిన రిలీజ్ గ్లింప్స్ ఉందని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ఈ గ్లింప్స్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుంది.
దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ గ్లింప్స్ ని నింపేయగా అనుష్క తన ఊచకోత చూపించారని చెప్పాలి. క్రిష్ చెప్పినట్టుగానే అనుష్క విశ్వరూపమే ఈ సినిమాలో కనిపించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ లో మ్యూజిక్ మరో ఎసెట్ అని చెప్పాలి. కనిపించే విజువల్స్ ని ఎలివేట్ చేసేలా సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి స్కోర్ సాలిడ్ గా ఉంది.
ఇక ఫైనల్ గా అనుష్క పేల్చిన మాస్ డైలాగ్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ ని మంచి రెస్పాన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ గట్టిగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం ఈ కొత్త గ్లింప్స్ మాత్రం మరింత అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంకి యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి