నాని ‘శ్యామ్ సింగ రాయ్’లో బాలీవుడ్ నటి !

నాని ‘శ్యామ్ సింగ రాయ్’లో బాలీవుడ్ నటి !

Published on Aug 16, 2020 10:00 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి అదితి రావు హైదరి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నెగటివ్ రోల్ లో కనిపించబోతుందని.. అలాగే ఆమె క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి అదితి రావు, నానికి జోడిగా నటిస్తోందా లేక ఆమెది సెపెరేట్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ అండ్ క్రేజీ బ్యూటీ ‘సాయి పల్లవి’ని తీసుకున్నారట. ఇక ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు