ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రమే “మదరాశి”. పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ ట్రైలర్ కట్ ని ఇపుడు విడుదల చేశారు. అయితే చాలా కాలం తర్వాత మురుగదాస్ నుంచి ఒక ప్రామిసింగ్ ట్రైలర్ వచ్చింది అని చెప్పవచ్చు.

దర్బార్ సినిమా తర్వాత మళ్ళీ ఆడియెన్స్ లో ఈ సినిమా చూడాలి అనే రీతీలో ఫుల్ యాక్షన్ బ్లాక్ లతో అదరగొట్టేసారు. ఇక మురుగదాస్ మార్క్ యాక్షన్ తో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. హీరో శివ కార్తికేయన్ రోల్ లో కూడా మురుగదాస్ యునిక్ మార్క్ కనిపిస్తుంది. అందులో శివ కార్తికేయన్ మంచి అగ్రెసివ్ గా క్రేజీ యాక్షన్ మూమెంట్స్ తో కనిపిస్తున్నాడు.

అలాగే రుక్మిణి వసంత్ కి కూడా మంచి కీలక పాత్ర దక్కినట్టు కనిపిస్తుంది. అలాగే తుపాకీ విలన్ విద్యుత్ జమ్వల్ మరోసారి షైన్ అయ్యారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో యాక్షన్ అదరగొట్టారు. ఇక తాను అనుకున్న దానికోసం హీరో ఎంత దూరం అయినా వెళ్లగలిగే అంశం ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేసేలా కనిపిస్తుంది. ఇక మరో హైలైట్ మాత్రం అనిరుద్ స్కోర్ అని చెప్పాల్సిందే. చాలా కూల్ అండ్ సాలిడ్ బీట్స్ ని తాను అందించాడు. ఇక ఈ సెప్టెంబర్ 5న రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version