ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘ఘాటి’

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటించిన రీసెంట్ మూవీ ‘ఘాటి’ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ, రిలీజ్ తర్వాత అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి(సెప్టెంబర్ 26) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version