విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు మదాది, జగపతి బాబు, తదితరులు
దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
సంగీత దర్శకుడు : నాగవెల్లి విద్యాసాగర్
సినిమాటోగ్రాఫర్ : మనోజ్ రెడ్డి కళాసాని
ఎడిటర్ : చాణక్య రెడ్డి తూరూపు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి పండిస్తూ తరలించే ఘాటీలు కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్), శీలావతి(అనుష్క శెట్టి), దేశి రాజు(విక్రమ్ ప్రభు)ల తో పనిచేస్తుంటారు. అయితే, వారు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. దీంతో నాయుడు వారిని వ్యతిరేకించి, ఘాటీలను నాశనం చేస్తాడు. దీంతో శీలావతి రెబెల్ గా మారి వారిని ఎలా ఎదిరించింది.. ఆమె తన ప్రతీకారం ఎలా తీర్చుకుంది? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ పాత్రలో చాలా ఈజ్ గా కనిపించింది. చాలా సీన్స్ లో ఆమె నటన, యాక్షన్, ఎమోషన్స్ మెప్పిస్తాయి.
విక్రమ్ ప్రభు టాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇచ్చాడు. అతని పాత్ర నిడివి తక్కువ ఉన్నా, మెప్పిస్తాడు. అనుష్క తో అతడి సీన్స్ ఆకట్టుకుంటాయి.
జగపతి బాబు సినిమా కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పిస్తాడు. చైతన్య రావు పాత్ర బాగుంది. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో యాక్షన్, లవ్, రివెంజ్ లాంటి అంశాలు ఉన్నా.. గ్రిప్పింగ్ స్టోరీలైన్ లేకపోవడం మైనస్. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా సాగుతుంది. దీంతో చాలా సీన్స్ ఆసక్తి క్రియేట్ చేయలేక పోతాయి.
సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. వీక్ రైటింగ్ కారణంగా అది వర్కౌట్ కాలేదు. చాలా పాత్రలు అండర్ డెవలప్డ్ గా ఉన్నట్లు అనిపిస్తాయి.
అనుష్క శెట్టి, రవీంద్ర విజయ్ ల పాత్రలు కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. వారికి సరైన ఎలివేషన్స్ పడలేదు అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
సాంకేతిక విభాగం:
చింతకింది శ్రీనివాస్ రావు రచన బలహీనంగా ఉంది. క్రిష్ డైరెక్షన్ కూడా అదే తరహా లో కనిపిస్తుంది. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ కొంతవరకు బాగున్నా, పూర్తిగా ఆకట్టుకోవు. ఘాటి విజువల్స్ పరంగా చక్కగా చూపెట్టారు. కానీ ఎడిటింగ్ వర్క్ పై ఇంకా ఫోకస్ పెట్టి ఉండాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉండాల్సింది. విద్యా సాగర్ మ్యూజిక్ బీజీఎం వరకు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్ గా చూస్తే, ‘ఘాటి’ ఒక రివెంజ్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంది. అనుష్క శెట్టి ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, విక్రమ్ ప్రభు డీసెంట్ నటన మెప్పిస్తాయి. కథలో బలం లేకపోవడం, డల్ ఎగ్జిక్యూషన్, కొన్ని పాత్రల డిజైన్ అక్కట్టుకోకపోవడం మైనస్. రివెంజ్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team