ఇండియన్ స్క్రీన్ పైకి మరో సూపర్ హీరో రోల్.!

ఇండియన్ స్క్రీన్ పైకి మరో సూపర్ హీరో రోల్.!

Published on Aug 21, 2020 11:12 PM IST

సినిమా ప్రేమికులకు ఎన్నో రకాల జానర్ లు అంటే ఇష్టం ఉంటాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా అందరికీలే ఎక్కువగా ఇష్టమైన మరో జానర్ లలో సూపర్ హీరోల పై తీసే జానర్ కూడా ఒకటి. అయితే ఈ కోణం నుంచి మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువ సినిమాలు మరియు తక్కువ రోల్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే వాటిలో సూపర్ హిట్టయినవీ ఉన్నాయి అంతగా క్లిక్ అవ్వనివి కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు మన ఇండియన్ స్క్రీన్ మీదకు మరో సూపర్ హీరో పరిచయం కానున్నట్టు తెలుస్తుంది. అది కూడా ప్లానింగ్ మామూలుగా కూడా లేదట. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ తో మన దేశంలోనే పెద్దదైన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో వీరు ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రానికి ఒక కొత్త దర్శకుడు టేకప్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్టు సమాచారం. అలాగే అజయ్ దేవ్ గన్ తో వీరి ఫ్రాంచైజీలో వస్తున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులు తీయనున్నట్టు టాక్. మరి మన ఇండియన్ సినిమా మీదకు వస్తున్న ఈ సూపర్ హీరో ఎలా ఉండనున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు