బాలు గారు కోలుకోవాలని లెజెండరీ సింగర్ రిక్వెస్ట్.!

బాలు గారు కోలుకోవాలని లెజెండరీ సింగర్ రిక్వెస్ట్.!

Published on Aug 20, 2020 8:15 AM IST

మన దేశపు లెజెండరీ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం చెన్నై ఎం జి ఎం ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రు సిబ్బంది వారు ఎప్పటికప్పుడు బులిటెన్ వదులుతూనే ఉన్నారు. అయితే వారు చెబుతున్న సమాచారం ప్రకారం బాలు గారి ఆరోగ్య పరిస్థితి ఉంది అంటున్నారు మరోసారి తీవ్రంగా ఉంది అంటున్నారు.

తాజాగా వదిలిన బులెటిన్ ప్రకారం ఆయన ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నారని ఈసీఎంవో మీద ఐసీయూ లో చికిత్స పొందుతున్నారని వచ్చిన వార్త వారి అభిమానులను మరింత కలచివేసింది. దీనితో కోలీవుడ్ నుంచి ఆయన త్వేరగా కోలుకోవాలని మరింత మంది ప్రముఖులు కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు మనోబాలం బాలు గారు కోలుకోవాలని ప్రతీ ఒక్కరు ప్రార్ధించాలని తెలిపారు. అలాగే మరో లెజెండరీ సింగర్ హరిహరన్ మనందరం బాలు గారు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిద్దామని ఈ రోజు 20వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ప్రతీ ఒకరు ఒక 5 నిమిషాల పాటు ఆయన కోసం ప్రార్ధిద్దామని రిక్వెస్ట్ చేసి వీడియో పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు