ప్రభాస్ 21 లో నివేతా రోల్ పై మరో బజ్.!

ప్రభాస్ 21 లో నివేతా రోల్ పై మరో బజ్.!

Published on Aug 22, 2020 8:11 AM IST

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో ప్రభాస్ ఎక్కువగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ నాగశ్విన్ తో చేయనున్నది. ఎలాగో రాధే శ్యామ్ పూర్తి కావొస్తుంది. అలాగే ఆదిపురుష్ మొదలు కావడానికి చాలా సమయం ఉంది. అందుకే వీరి కన్ను ఏ చిత్రం కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంది.

అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి ఒక బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ నివేతా థామస్ కూడా కనిపించనుంది అని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏఈ టాక్ మరింత బలంగా వినిపిస్తూ ఆమె రోల్ ఏమిటి అన్న దాని పై క్లారిటీ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో నివేతా ప్రభాస్ సోదరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉన్నా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో నివేతా కనిపిస్తే ఆమె కెరీర్ కు మరింత బూస్టప్ రావడం ఖాయం అని చెప్పాలి. మరి ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు