రవితేజ సరసన అంజలి

రవితేజ సరసన అంజలి

Published on Oct 19, 2012 8:00 AM IST


వెరైటీ టైటిల్స్ తో సినిమాలు చేసే మాస్ మహారాజా రవితేజ ఈ సారి ‘బలుపు’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. గతంలో రవితేజతో ‘డాన్ శీను’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ మలినేని రెండవసారి రవితేజతో కలిసి పనిచేస్తున్నాడు. శృతి హాసన్ మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి రెండవ హీరొయిన్ పాత్రలో నటిస్తుంది. జర్నీ సినిమా తరువాత తెలుగులో బాగా ఫేమస్ అయిన అంజలి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న బలుపు అక్టోబర్ 25న ముహుర్తంతో ప్రారంభం కానుంది. కోన వెంకట్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు. గోపీచంద్ ఇటీవలే వెంకటేష్ తో బాడీగార్డ్ సినిమా హిట్ అందుకున్నాడు.

తాజా వార్తలు