ఏప్రిల్ చివర్లో రానున్న నయనతార ‘అనామిక’

ఏప్రిల్ చివర్లో రానున్న నయనతార ‘అనామిక’

Published on Mar 26, 2014 12:17 PM IST

anamika
సున్నితమైన బావోద్వేగంతో కూడిన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రూటు మార్చి రీమేక్ పై మక్కువ చూపి చేసిన సినిమా ‘అనామిక’. అందాల భామ నయనతార ఈ మూవీ టైటిల్ రోల్ లో నటించింది. సినిమా ‘అనామిక’. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది. కానీ రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాని ఏప్రిల్ 18 లేదా 25 తేదీల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ ఉండడం వల్ల థియేటర్స్ దొరికే దాన్ని బట్టి ఆ రెండు తేదీల్లో ఏదో ఒక తీదీని ఖరారు చేస్తారు. అలాగే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కహానీ’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా విజయంపై శేఖర్ కమ్ముల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. హర్షవర్ధన్ రాణే, వైభవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

తాజా వార్తలు