మాస్ గా హరిప్రియ – క్లాస్ గా వరుణ్.!

మాస్ గా హరిప్రియ – క్లాస్ గా వరుణ్.!

Published on Oct 17, 2012 6:00 PM IST


ఈ మాస్ ఏంటీ , క్లాస్ ఏంటీ అని తికమక పడుతున్నారా? అసలు విషయం ఏమిటంటే..ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్ లేక పూర్తిగా డీలా పడిపోయిన వరుణ్ సందేశ్ హీరోగా, ‘పిల్ల జమిందార్’ సినిమాతో విజయం అందుకున్నప్పటికీ అవకాశాలు తక్కువగా ఉన్న హరిప్రియ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది. గత నెల రోజులుగా నిర్విరామమగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి ఈ చిత్ర టీం పత్రికా విలేకరులతో సమావేశమయ్యారు. ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కోనేటి శీను మాట్లాడుతూ ‘ మా సినిమాకి ‘అబ్బాయి క్లాస్ – అమ్మాయి మాస్’ అనే టైటిల్ ని నిర్ణయించాము. ఒక క్లాస్ అబ్బాయికి మరియు ఒక మాస్ అమ్మాయికీ మధ్య పరిచయం మరియు ప్రేమ ఎలా కలిగిందనేదే ఈ చిత్ర కథాంశం అని’ ఆయన తెలిపారు. అలాగే నవంబర్ చివరి కల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని మరియు ఆ తర్వాత సరైన సందర్భం చూసుకొని సినిమా విడుదల చేస్తామని తెలియజేసారు. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ సినీ విసన్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కేదారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్, హరిప్రియ, ఈ చిత్ర సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మరియు పాటల రచయత భాస్కర భట్ల తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు