తెలుగు లో నూ తమిళం లోను సంచలన విజయాలను అందుకున్న చిత్రం రంగం. ఈ చిత్రం లో యువ కథ నాయకుడు జీవా నటించగా, ప్రముఖ దర్శకులు కే.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ హిందీ దర్శకుడు ప్రకాష్ ఝా హిందీ లో తీయనున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ మరియు రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలను పోషిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంకా కొన్ని అంశాల లో పూర్తి వివరాలు తెలియలేదు. స్క్రిప్టు పనులను ప్రకాష్ ఝా పూర్తి చేసిన వెంటనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ‘రంగం’ చిత్రం లో చక్కటి కథ తో పాటు ఆకట్టుకొనే స్క్రీన్ప్లే మనం చూసాం. ప్రకాష్ ఝా ఎంతటి ప్రతిభ కలిగిన దర్శకుడో మనకు తెలుసు. మరి అటువంటి దర్శకుడు ఈ చిత్రాన్ని తీస్తే ఇక హిట్ గారంటీ కదూ.