అమితాబ్, కైకాలకి దక్కిన జాతీయ పురస్కారాలు

అమితాబ్, కైకాలకి దక్కిన జాతీయ పురస్కారాలు

Published on Apr 1, 2013 11:40 PM IST

Amithab-and-sathyanarayana
సినీ రంగానికి తాను అందించిన అపారమైన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అబితాబ్ బచ్చన్ ని 2011 ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించింది.
అమితాబ్ ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో కూడా చెయ్యకపోయినా(‘అమృతవర్షం’ సినిమాలో గెస్ట్ ఎపియరెన్స్ తప్ప), నాలుగు దశాబ్దాలుగా తను సినిమాలలో హీరోగా నటిస్తూ లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్స్ అందించినందుకు ఈ సత్కారంతో సత్కరించారు. అమితాబ్ కే కాక, శ్యామ్ బెంగాల్ కి గౌరవ బి.ఎన్ రెడ్డి దర్శకత్వ పురస్కారం లభించింది. సినీ రంగానికి సేవలు అందించినందుకు బి.ఎన్ రెడ్డి కి ఈ ఏడాది ఏ.ఎన్.ఆర్ జాతీయ పురస్కారం కుడా దక్కింది.

పద్మాలయా స్టూడియోస్ ద్వారా సినిమాని, సినీ రంగాన్ని అభివృద్ధి పరుస్తున్న జి. శేషగిరిరావుకు నాగి రెడ్డి పురస్కారం దక్కింది. ఇదిలా ఉండగా, మునుపటి తరం నటుడు కైకాల సత్యన్నారాయణ ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుల ప్రధానం అంబరాన్ని అంటే రీతిలో ఈ ఏడాది ఉగాది రోజున నిర్వహించనున్నారు. వీటిని తమ్మారెడ్డి భరద్వాజ, కె.సి. శేఖర్ బాబు మరియు ఎం. బాలయ్య ప్రధానం చేయనున్నారు.

తాజా వార్తలు