‘నాన్న’ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అమలా పాల్ ఆ తరువాత ‘బెజవాడ’ సినిమాలో నటించినప్పటికీ ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా ద్వారా యువతకు దగ్గరైంది. రామ్ చరణ్ సరసన వివి వినాయక్ సినిమాలో రెండవ కథానాయికగా నటించే అవకాశం కొట్టేసిన ఈ భామ రవితేజతో ‘సారోస్తార’ అనే సినిమాలో నటించమని కోరగా డేట్స్ సమస్య వల్ల నటించలేను అని చెప్పిందంట. పరుశురాం డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు సమాచారం.