శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో మళ్ళీ తెరపైకి వచ్చిన విలక్షణ నటి అక్కినేని అమల త్వరలోనే బాలీవుడ్లో మెరవనుంది. హిందీలో రానున్న ‘లిస్టెన్ అమయ’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనుంది. అందరికీ బాగా పరిచయమున్న నటి దీప్తి నావల్ – ఫరూక్ షైక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో అమల దీప్తి మరదలు సుజాత పాత్రలో కనిపించనుంది.
ఇప్పటికే ఈ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు ప్రశంశలు అందుకుంది. ఈ సినిమా 2013 ఫిబ్రవరిలో విడుదల కానుంది. అమల తనకున్న టైంలో ఎక్కువభాగం చిన్న పిల్లలు మరియు జంతు సంరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటోంది.