అల్లు అర్జున్ సెలక్షన్ చూస్తే అదుర్స్ అనాల్సిందే !

అల్లు ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దూసుకు వెళుతోంది. ఒకవైపు బన్నీ స్టార హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వెళుతుంటే ఇంకోవైపు అల్లు అరవింద్ నిర్మాతగా కొత్త పుంతలు తొక్కుతున్నారు. సినిమా ఓటీటీ మాధ్యమంలోకి వెళ్లిపోవడాన్ని గమనించిన ఆయన ప్రత్యేకంగా ‘ఆహా’ పేరుతో ఓటీటీని లాంచ్ చేశారు. అందులో డిజిటల్ కంటెంట్ కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్తగా ప్రపంచస్థాయి సౌకర్యాలతో అల్లు స్టూడియోస్ నిర్మిస్తున్నారు.

ఆయన బాటలోనే అడుగులు వేస్తున్నారు బన్నీ. ఓటీటీలో వెబ్ సిరీస్ ఫార్మాట్ బాగా క్లిక్ అయింది. జనం సినిమాల కంటే వేస్ సిరీస్ కంటెంట్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వాటి మీద దృష్టి పెట్టారట. సొంతగా బ్యానర్ ఏర్పాటు చేసి వెబ్ సిరీస్ లు నిర్మించాలనేది ఆయన ఆలోచనట. అయితే ఇక్కడ కూడ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కంటెంట్ ఎక్కువగా బయోపిక్స్ రూపంలో ఉండేలా చూసుకుంటున్నారట. ప్రేక్షకుల్లో కూడ బయోపిక్స్ మీద అభిరుచి బాగా పెరిగింది. అందుకే బన్నీ ఆ తరహాలో వెబ్ సిరీస్ లు చేయాలనుకుంటున్నారట.

Exit mobile version