స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని ఇది వరకే తెలిపారు. రేపు విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. నల్లమలపు బుజ్జి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కథా చర్చలు ఇంకా పూర్తి కాలేదు. అవన్నీ పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకొంత సమయం పడుతుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ కోసం టాలీవుడ్లో ఉన్న ఒక టాప్ హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబందించిన నటీనటులు మరియు ఇతర విభాగాలకు సంబంధిన వారి వివరాలు రేపు తెలియజేస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమాని గణేష్ నిర్మిస్తున్నారు.