స్టన్నింగ్ లుక్ తో “ఆహా” అనిపించిన “పుష్ప”రాజ్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పటి వరకు ఎన్నో లుక్స్ లో కనిపించి స్టన్ చేసాడు. అలా ఇప్పుడు లేటెస్ట్ గా తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో చేయనున్న “పుష్ప” కోసం పక్కా మాస్ లుక్ లోకి మారిపోయాడు. అయితే ఈ సినిమా షూట్ ఇంకా మొదలు కాకపోయినా అప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా తన ఫ్యాన్స్ కోసం ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం రెడీ అయ్యి లాంచ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పుష్ప రాజ్ మాస్ లుక్ లో కనిపిస్తే అదే పుష్ప రాజ్ స్టైలిష్ గా ఉంటే ఎలా ఉంటాడో “ఆహా” వారు టీజ్ చేసారు.

మన తెలుగు మొట్టమొదటి స్ట్రీమింగ్ సంస్థ అయినటువంటి “ఆహా” బన్నీ కుటుంబానికి చెందిందే అని అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ను బన్నీతో ఈ నవంబర్ 13న సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నాడు. ఇపుడు దానికి సంబంధించిన వీడియో లోనే బన్నీ సూపర్ స్టైలిష్ అండ్ ఫ్రెష్ లుక్ లో కనిపించి మరోసారి తనని స్టైలిష్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ప్రూవ్ చేస్కున్నాడు. మొత్తానికి మాత్రం ఈ వెర్షన్ పుష్ప రాజ్ ఏం రివీల్ చేస్తాడో అప్పుడు చూడాలి.

Exit mobile version