స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చాలా చాలా హ్యాపీ గా ఉన్నాడు. అంత ఆనందంగా ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారా.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఈ రోజు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. గత కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్ తన భార్య గర్భవతిగా ఉన్నప్పటి ఫోటోలు కొన్ని ఫేస్ బుక్ లో రిలీజ్ చేసి తన ఆనందాన్ని పంచుకుంటూ వచ్చాడు. కానీ నేటితో ఇద్దరు తల్లి తండ్రులయ్యారు.
అలాగే పుట్టిన బాబు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. దీంతో అల్లు ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. అలాగే వచ్చే వారంలో బన్ని నటించిన ‘రేసు గుర్రం’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.