దేవిశ్రీ, థమన్ కుడి ఎడమయ్యారుగా..!

ఈ ఏడాది బాడా హీరోల మధ్య సంక్రాంతి పోరు ఆసక్తికరంగా సాగింది. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా రెండు చిత్రాలు భారీ వసూళ్లు సాధించి ఔరా అనిపించాయి. ఈ చిత్రాల హీరోలతో పాటు, సంగీత దర్శకుల మధ్య కూడా అనుకోకుండా పోటీ వాతావరణం ఏర్పడింది. ఐతే అల వైకుంఠపురంలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడంతో దేవిశ్రీ పై థమన్ దే పైచేయి అయ్యింది. కాగా ఈ ఇద్దరు సంగీత దర్శకులు ఇప్పుడు అటుఇటు అయ్యారు. మహేష్ కి సంగీతం ఇచ్చిన దేవిశ్రీ సుకుమార్ చిత్రం కోసం బన్నీకి పనిచేస్తుండగా, అల వైకుంఠపురంలో మ్యూజిక్ కి ఫిదా అయిన మహేష్ వంశీ పైడిపల్లి సినిమా కోసం థమన్ ని ఎంపిక చేశారు.

ఇలా బన్నీ మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ కి..మహేష్ మ్యూజిక్ డైరెక్టర్ బన్నీకి సంగీతం అందిస్తున్నాను. దేవిశ్రీ మొదటినుండి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో దేవిశ్రీ అవార్డు విన్నింగ్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఇక థమన్ గతంలో బిసినెస్ మాన్ చిత్రానికి సంగీతం అందించారు. బిజినెస్ మాన్ సంగీతం కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ వీరిద్దరిలో ఎవరి సంగీతం హైలెట్ కానుందో చూడాలి.

Exit mobile version