దసరా బరిలో ‘యముడికి మొగుడు’


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘యముడికి మొగుడు’ చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇంకా కేవలం రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ సరసన రిచ పనాయ్ కథానాయికగా నటిస్తోంది. సాయాజీ షిండే యమధర్మ రాజుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందిస్తున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత వారం అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇంతలోనే మరో చిత్రంతో దసరా బరిలో దిగడానికి నరేష్ సిద్దమవుతున్నాడు.

Exit mobile version