నరేష్ కు రియల్ సక్సెస్ స్టార్ట్ అయ్యింది.!

నరేష్ కు రియల్ సక్సెస్ స్టార్ట్ అయ్యింది.!

Published on Feb 20, 2021 5:17 PM IST

ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన ప్రస్థానాన్ని సుస్థిరం అని చెప్తూ కం బ్యాక్ ఇచ్చారు. అయితే చిరు చెప్పిన ఆ డైలాగ్ మాత్రం ఇపుడు హీరో అల్లరి నరేష్ కు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యిందని చెప్పాలి. కేవలం ఏదో ఎలివేషన్ కోసం అని కాదు కానీ నరేష్ కు ఇది ఒక ఎమోషనల్ కం బ్యాక్ అని చెప్పాలి. తాను చేసింది ఏ జానర్ సినిమా అన్నది పక్కన పెడితే ఏదైనా సరే సక్సెస్ అవ్వడం ముఖ్యం. మరి ఆ సక్సెస్ అందుకోవడానికి నరేష్ కు ఎనిమిదేళ్లు పట్టింది.

దీనితో సభాముఖంగానే నరేష్ కంటతడి పెట్టుకున్నాడు. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ “నాంది” మొదటి ఆటతోనే నరేష్ కు నటుడిగా సినిమా పరంగా కూడా మంచి టాక్ ను సంతరించుకుంది. అయితే డీసెంట్ గానే ఈ చిత్రం విడుదల కాబడిన ఈ రెండో రోజు నుంచే ఈ చిత్రాన్ని అన్ని చోట్లా షోలు పెరగడం మొదలయ్యాయి స్క్రీన్స్ పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి నరేష్ కు రియల్ సక్సెస్ స్టార్ట్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి నరేష్ నుంచి తప్పకుండా మరింత సాలిడ్ పాత్రలను కూడా ఆశించొచ్చు అని మరో గ్యారంటీ కూడా వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు