“నాంది” ట్రైలర్..’అల్లరి’ నరేష్ నుంచి సరికొత్త కోణం.!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అతి తక్కువ కామికల్ ఎంటర్టైనింగ్ హీరోల్లో ‘అల్లరి’ నరేష్ ఒకరు. ఒక్క కామెడీ సినిమాలతోనే కాకుండా నటుడిగా కూడా తనలోని ఇతర యాంగిల్స్ ను కూడా కొన్ని సినిమాల్లో చూపించారు. మరి అలా తనలోని సరికొత్త కోణాన్ని మాత్రం పూర్తి స్థాయిలో “నాంది”లో చూపించడం ఖాయం అనిపిస్తుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం నుంచి ట్రైలర్ ఇపుడు విడుదల కాబడింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కాబడిన ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. అంతే కాకుండా ఇందులో లైన్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు తనకు సంబంధం లేని ఓ కేసులో ఇరుక్కున్న అమాయకుడు జైలులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎదుర్కొని ఏమయ్యాడు అన్న లైన్ లో కనిపిస్తుంది.

మరి దీనిని అంతే అద్భుతంగా నరేష్ హ్యాండిల్ చేసాడు. అలాగే ఆ పాత్రలో తన నటనా పరిపూర్ణత చాలా బాగా కనిపిస్తుంది.అలాగే నరేష్ తన మేకోవర్ లోని వేరియేషన్స్ కూడా బాగున్నాయి. దీనితో నరేష్ లోని సరికొత్త కోణం ఖచ్చితంగా విట్నెస్ చేయబోతున్నాం అని చెప్పాలి. అలాగే నరేష్ లాయర్ గా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి రోల్ లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇక అలాగే సిడ్ సినిమాటోగ్రఫీ చాలా నాచురల్ గా కనిపిస్తుంది. శ్రీ చరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కు మరో అదనపు ఆకర్షణగా నిలిచింది.అలాగే సీనియర్ దర్శకుడు సతీష్ వేగేశ్న గారి నిర్మాణ విలువలు అత్యుత్తమంగా ఉన్నాయి. మొత్తానికి మాత్రం అల్లరి నరేష్ కు ఈ “నాంది” సరికొత్త నాంధి(బ్రేక్) పలికేలానే ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలి అంటే ఈ ఫిబ్రవరి 19 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version