ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సాలిడ్ చిత్రంలో ప్రతీ అంశాన్ని కూడా సాలిడ్ గా అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే బన్నీ – సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ ల మ్యూజికల్ కాంబో అన్నా కూడా ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా తెలిసిందే. అలా ఈ సారి వస్తున్న ఈ హ్యాట్రిక్ కాంబోపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అలాగే సుకుమార్ తో బన్నీ సినిమా అంటే మాస్ అండ్ స్టైలిష్ డాన్సులు కూడా కన్ఫర్మ్.
కానీ ఈ సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలా కనిపిస్తుంది కాబట్టి మాస్ డాన్స్ నే బన్నీ నుంచి ఆశించొచ్చు. మరి ఆ మాస్ నంబర్స్ లో దిట్ట అయినటువంటి జానీ మాస్టర్ పుష్ప షూట్ కూడా వెళ్తున్నట్టుగా తెలిపారు. దీనితో ఈ చిత్రంలో ఒక పక్కా మాస్ సాంగ్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. మరి దీనిని ఎలా ప్లాన్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
On the way to #Pushpa shoot ????#Tenkasi #Tamilnadu #AlluArjun #Sukumar@alluarjun @aryasukku @MythriOfficial pic.twitter.com/VRqGheA87h
— Jani Master (@AlwaysJani) February 20, 2021