వార్-2 లో ఆమె కూడానా.. లింక్ కోసమే సింక్..?

వార్-2 లో ఆమె కూడానా.. లింక్ కోసమే సింక్..?

Published on Jul 27, 2025 1:00 AM IST

war2

బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘వార్ 2’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై బజ్ భారీగా ఏర్పడింది.

ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేయగా దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ట్రైలర్ రిలీజ్‌తో ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె నెక్స్ట్ నటించే ‘ఆల్ఫా’ చిత్రానికి లీడ్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇందుకోసమే ఆమె ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ‘వార్-2’ని ప్రమోట్ చేసిందనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఏదేమైనా ఆల్ఫా కోసం ఆలియా చేస్తున్న ఫీట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు