అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాలోని సామజవరగమన, బుట్ట బొమ్మ, రాములో రాములా వంటి సాంగ్స్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి.
అయితే తాజాగా ఈ సినిమాలోని రాములో రాములా వీడియో సాంగ్ ఓ సెన్సేషన్ రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్‌లో ఏకంగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి బన్నీ ఖాతాలో మరో రికార్డ్‌ని నెలకొల్పింది.
రాములో రాములా సాంగ్ వీక్షించండి