“అల వైకుంఠపురములో” హవా ఇంకా తగ్గలేదు.!

గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ మ్యూజికల్ అండ్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురములో”. సంక్రాంతి కానుకగా విడుదలయ్యి బన్నీ కెరీర్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే భారీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం కూడా ఎంత పెద్ద హిట్ అయ్యిందో కూడా తెలిసిందే. థమన్ అందించిన ఆల్బమ్ లో సెన్సేషనల్ హిట్ కాబడిన ట్రాక్స్ లో “రాములో రాముల” కూడా ఒకటి. మరి ఈ సాంగ్ ఇప్పుడు మరి అరుదైన రికార్డు నెలకొల్పినట్టు తెలుస్తుంది.

అటు లిరికల్ సాంగ్ ఇటు ఫుల్ వీడియో సాంగ్ రెండిట్లో కూడా భారీ స్థాయిలో 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మొట్టమొదటి దక్షిణాది సాంగ్ గా రికార్డు సృష్టించింది. దీనితో ఈ సినిమా రికార్డుల జాబితాలో ఇదొకటి యాడ్ అయ్యిందని చెప్పాలి. మరి ప్రస్తుతం బన్నీ మరియు పూజా లు తమ పాన్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version