నా తొలి చిత్రానికి మా నాన్నే దర్శకత్వం వహిస్తారు – ఆకాష్


ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తండ్రిగా గర్వపడుతున్నారు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ “ధోని” మరియు “గబ్బర్ సింగ్” చిత్రాలలో ప్రదర్శనకు గాను ఆకాష్ మంచి ప్రశంశలు పొందారు ఆకాష్ కి యాక్షన్ చిత్రాలంటే చాలా ఇష్టం భవిష్యత్తులో మంచి యాక్షన్ హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. “నాకు యాక్షన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం భవిష్యత్తులో యాక్షన్ చిత్రాలలో తప్పకుండా నటిస్తా మా నాన్న నా తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తారు” అని అన్నారు.

గబ్బర్ సింగ్ చిత్ర విజయం గురించి అడుగగా ఆకాష్ ఇలా స్పందించారు ” నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆయన చిత్రం విజయం సాదించటం చాలా ఆనందంగా ఉంది ఈ చిత్రం లో నా ప్రదర్శన గురించి అందరు మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

అదండి విషయం! ఆకాష్ లో ఉన్న ప్రతిభ తన తండ్రి పూరి జగన్నాథ్ కి మరియు ఆంధ్ర దేశానికి భవిష్యత్తు లో మంచి పేరు తెచ్చిపెడతాయని ఆశిద్దాం.

Exit mobile version