టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన ఆకాష్ జగన్నాధ్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తల్వార్’. కాశి పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
‘తల్వార్’ చిత్రానికి సంబంధించిన ఆడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆకాష్ జగన్నాధ్ చెప్పే ఓ సాలిడ్ డైలాగ్ మనకు ఈ ఆడియో గ్లింప్స్‌లో వినిపిస్తుంది. ధర్మం, అధర్మానికి మధ్య జరిగే యుద్ధం బ్యా్క్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగబోతుందని ఈ డైలాగ్ వింటే అర్థమవుతుంది. ఆడియో గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్.
ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, అజయ్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈఎల్‌వి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి