హిందీ మిరపకాయ్ లో అజయ్ దేవగన్?

హిందీ మిరపకాయ్ లో అజయ్ దేవగన్?

Published on Jan 18, 2012 10:30 AM IST


తెలుగు లో భారి విజయం సాదించిన “మిరపకాయ్” చిత్రాన్ని హిందీ లో అజయ్ దేవగన్ చేయ్యబోతున్నారని తాజా సమాచారం. గతం లో ఈ చిత్ర రిమేక్ అక్షయ్ కుమార్ తో చేద్దామని ప్రయత్నిచిన హరీష్ శంకర్ ని అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని తనతో చెయ్యమని అడిగినట్టు తాజా సమాచారం.

ఈ సమాచారం సరయినదే అయితే “గబ్బర్ సింగ్” తరువాత హరీష్ శంకర్ ఈ చిత్రాన్నే చేస్తారు. తెలుగులో రవితేజ,రిచా గంగోపాధ్యాయ్,దీక్ష సెత్ లు నటించిన ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రం ఇక్కడ భారి విజయం సాదించడం తో హిందీ లో రిమేక్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. సింఘం చిత్ర విజయం తో ఊపు మీదున్న అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ఎలా చేస్తారో వేచి చూడాలి. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు