ఒక్క బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ఏ స్థాయిని తీసుకెళ్ళిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయనకు విదేశాలలో కూడా ఫాన్ బేస్ ఏర్పడింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఆ స్థాయి ఇమేజ్ తెచ్చిపెట్టిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్ లను కూడా సూపర్ ఫేమస్ చేయడం ఖాయం అని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో వీరిద్దరి పాత్రలను తీర్చిద్దిన తీరు ప్రేక్షకులను మైమరిపిస్తుందట . తెరపై కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ ని చూసిన ప్రేక్షకులు వారికి ఫ్యాన్స్ అయిపోవడం ఖాయం అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్, చరణ్ ఇమేజ్ ఆకాశానికి చేరుతుందని చాల మంది విశ్వాసంతో ఉన్నారు. ఇక హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరగనుంది. మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా విరామంలో ఉన్న ఎన్టీఆర్, చరణ్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు.