రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమాతో ఎంతగానో అలరించిన నటుడు రాజీవ్ కనకాల నుంచి మరో ఇంట్రెస్టింగ్ రోల్ వస్తుంది. భవప్రీతా ప్రొడక్షన్స్ నిర్మాత విజయ్ యం రెడ్డి మరియు ‘లవ్ ఓటిపి’ టీమ్ రాజీవ్ కనకాలపై ఓ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “వరుసగా సినిమాలు, వెబ్ సరీస్లు, షార్ట్ ఫిలిమ్‌లు ఇలా అన్ని ఫార్మాట్స్‌లో నటిస్తూ ఎంజాయ్ చేస్తున్నా. కరెక్ట్‌గా ఇదే సమయంలో ‘లవ్ ఓటిపి’ అంటూ నా దగ్గరికి వచ్చిన చిత్ర దర్శకుడు– హీరో అనీష్ కొత్త కథతో నా దగ్గరికి వచ్చాడు. ఈ చిత్రంలో నాకు నేనే ఎంతో కొత్తగా కనిపిస్తాను. సినిమాలో నన్ను చంపేస్తే మాత్రం నిన్ను చంపేస్తా అంటూ సరదాగా చేసిన ప్రమోషనల్ వీడియోతో మా సినిమా టైటిల్ ‘లవ్ ఓటిపి’ మీ ముందుకు వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
ఇక ఈ సినిమాలో అనీష్, స్వరూపిణి, జాన్విక, రాజీవ్ కనకాల, ప్రమోదిని, కాలకే రి,నాట్యరంగ, తులసి, అన్నపూర్ణ, చేతన్ గంథర్వ, రవి భట్ తదితరులు నటించగా ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ రాజా విక్రమ్, డిఓపి: హర్ష, ఎడిటర్: శరత్, ఫైట్స్: విక్రమ్ మోర్, డాన్స్: బాబా భాస్కర్, పి.ఆర్.ఓ: శివమ్ మీడియా నిర్మాత: విజయ్ యం.రెడ్డి, రచన: దర్శకత్వం: అనీష్ లు అందించారు.