అప్పుడు బన్నీ.. ఇప్పుడు నాని..!

తెలుగు సినిమాలకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ దక్కుతుందో అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా తెలుగు సినిమాలకు ఇతర భాషా సినీ ప్రేమికులు పట్టం కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సినిమాలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ దుమ్మురేపుతున్నాయి. అయితే, తెలుగు సినిమాలను బెంగాలీ భాషలో రిలీజ్ చేయడం చాలా అరుదు. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం చేసింది ఒక్క హీరోనే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2’ మూవీని బెంగాలీ భాషలో గ్రాండ్ రిలీజ్ చేశారు. ఆ సినిమాకు నెలకొన్న క్రేజ్ కారణంగా బెంగాలీలో ఆ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇలా బెంగాలీలో ఓ తెలుగు సినిమాను రిలీజ్ చేసిన తొలి హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు బన్నీ సాధించిన ఫీట్‌ను నాని కంటిన్యూ చేస్తున్నాడు. నాని తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఎవరూ ఊహించని కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక నాని ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర, గెటప్‌లో కనిపింనున్నాడు. అయితే, ఈ సినిమాను బెంగాలీ భాషలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 2026 మార్చి 26న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి బెంగాలీలో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ దక్కుతుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version