యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే తన పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్” షూట్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీని తర్వాత ఇప్పుడు మరో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” షూట్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అయితే దీని కంటే కూడా ముందే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ ప్రభాస్ తో “ఆదిపురుష్” అనే మరో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ను టేకప్ చేశారు. ఇందులో రామునిగా ప్రభాస్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే మరోపక్క ఇప్పటికే విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించేసారు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ వర్గాలు అయితే కృతి సనన్ ఫిక్స్ అయ్యింది అని ఎప్పటి నుంచో చెబుతున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం ఆ అప్డేట్ కు సంబంధించి ఎలాంటి ఊసు లేదు. మరి ఈ రోల్ కు సంబంధించి వారి వేట ఇంకా కొనసాగుతూనే ఉందా లేక ఆల్రెడీ ఆమెను ఫిక్స్ చేసిన ఆ వార్త ఓ స్పెషల్ డే రోజున రివీల్ చేస్తారా అన్నది చూడాలి.