ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందిన నటి రాశి గురించి అందరికీ తెలిసిందే. పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తూ సందడి చేస్తుంది. అయితే, తాజాగా ఆమె నటించిన ‘ఉసురే’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అయింది.
తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో రాశి తన కమ్‌బ్యాక్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోందని.. అయితే, తాను సినిమాల్లో నటించనని చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వ్యాపించాయి.. తన వద్దకు వచ్చే దర్శకనిర్మాతలు తాను సినిమాల్లో నటిస్తున్నారా.. అంటూ తనను అడగడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె చెప్పుకొచ్చింది.
తాను ఖచ్చితంగా సినిమాలు చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. ఇక రాశి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.