మొదలైన యాక్షన్ 3డి చివరి షెడ్యూల్

మొదలైన యాక్షన్ 3డి చివరి షెడ్యూల్

Published on Feb 24, 2013 5:20 PM IST

Action-3d

అల్లరి నరేష్, వైభవ్, శ్యామ్ మరియు రాజు సుందరం నటిస్తున్న ‘యాక్షన్ 3డి’ చివరి షెడ్యూల్ ఈరోజు ఉదయం చెన్నైలో ప్రారంభమయ్యింది. అనీల్ సుంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్, రీతు బర్మేచ, కామ్నా జఠ్మలాని మరియు నీలమ్ ఉపాధ్యాయ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ‘ఈగ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమాలో అధిక భాగం హైదరాబాద్, చెన్నై, బ్యాంకాక్, గోవాలలో తీసారు. ఈ చిత్రానికి బప్పా లహరి- బప్పి లహరి సంయుక్తంగా సంగీతం అందించారు. దీంట్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కె. రాఘవేంద్ర రావు పాటల స్టైల్లో అల్లరి నరేష్ – నీలం ఉపాధ్యాయ్ మీద ఓ పాటను తీశారు. థమన్ ఈ మూవీకి నేపధ్య సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో మార్చ్ ఆఖరి వారంలో విడుదల అవుతుంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం మన ముందుకు రానుంది.

తాజా వార్తలు