తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేయనున్న యాక్షన్ 3డి

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేయనున్న యాక్షన్ 3డి

Published on Feb 25, 2013 4:30 PM IST

action_3d_movie

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా ‘యాక్షన్ 3డి’ ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతుంది. హై టెక్నికల్ వాల్యూస్ తో, 3డి ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినిమాలో ఒక కొత్త ముద్రను వేస్తుందని అందరు అనుకుంటున్నారు. 3డి ఎఫెక్ట్స్ మినహా సినిమా పూర్తయింది. మిగిలిన కొన్ని సీన్స్ ను అత్యాదునిక హంగులతో నిర్మిస్తున్నారు.
అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కిక్’ శ్యాం, రాజు సుందరం , వైభవ్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. బప్పి లహరి – బప్ప లహరిలు సంయుక్తంగా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు యాక్షన్ 3డి సినిమా నరేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా . ఇది ఇండియాలోనే ఫస్ట్ 3డి కామెడీ సినిమా గా నిలువనుంది.

తాజా వార్తలు