మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అభిమానులు, ప్రేక్షజకులు టీజర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మామూలుగానే మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందునా కొరటాల శివ డైరెక్షన్ అనడంతో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టీజర్ విడుదలతో ఆ ఆసక్తి రెట్టింపైంది.
అందుకే ఆలస్యం చేయకుండా చిత్రం బృందం టీజర్ రిలీజైన కొద్దిసేపటికే రిలీజ్ డేట్ లాక్ చేసింది. మే 13న సినిమాను విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. పర్ఫెక్ట్ సమ్మర్ టైమ్ చూసుకుని రిలీజ్ చేస్తున్నారు. ఓపెనింగ్స్, లాంగ్ రన్ అన్నింటికీ వేసవి సెలవులు బాగా కలిసొస్తాయి. అప్పటికి సినిమా థియేటర్లు కూడ పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయి. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.