డబ్బింగ్ సీరియల్స్ బ్యాన్ చేయాలి

డబ్బింగ్ సీరియల్స్ బ్యాన్ చేయాలి

Published on Feb 20, 2013 2:00 PM IST

డబ్బింగ్ సీరియల్స్ వల్ల ఉపాధి కోల్పోతున్నామని తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి ఆరోపించింది. డబ్బింగ్ సీరియల్స్ వల్ల తెలుగు టెలివిజన్ పరిశ్రమ సంవత్సరానికి దాదాపుగా 150 కోట్లు నష్టపోతుందని వారు ఆరోపించారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి సమావేశం జరగగా కోర్ కమిటీ కన్వీనర్ డి. సురేష్ కుమార్ మాట్లాడుతూ డబ్బింగ్ సీరియల్స్ వల్ల ఉపాధి కోల్పోయి గత నెలలో ముగ్గురు ఆర్టిస్టులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న చానల్స్ లో 60 డబ్బింగ్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. వీటి వల్ల 3600 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు.

తాజా వార్తలు