‘ఎస్.ఎం.ఎస్’ సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన సుదీర్ బాబు తన రెండో సినిమా అయిన ‘ప్రేమ కధా చిత్రమ్’తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సుదీర్ తన తదుపరి చిత్రం ‘ఆడు మగాడు రా బుజ్జీ’ ద్వారా మనముందుకు రానున్నాడు
ఈ సినిమాలో ఒక్కపాట మినహా షూటింగ్ మొత్తం ముగిసింది. ఈ సినిమాలో సుదీర్ తొలిసారిగా తన సిక్స్ ప్యాక్ బాడీ ను చుపించానున్నాడు. దీనికోసం సుధీర్ చాలా కష్టపడ్డాడు. ఈ చిత్రం కామెడీని మేళవించిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలో ఆడియో, వచ్చే నెలలో సినిమా విడుదలకానున్నాయి
అస్మితా సూద్, పూనం కౌర్ హీరోయిన్స్. కృష్ణ రెడ్డి గంగాదాసు దర్శకుడు. సాయి కొమ్మినేని సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎస్.ఎన్ రెడ్డి మరియు సుబ్బారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు